వాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
రేగొండ మండల కేంద్రంలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలను విద్యార్థులే స్వీకరించి వివిధ పదవుల్లో సేవలు అందించారు.కార్యక్రమానికి డీఈఓ గా గాజర్ల జ్ఞాన తేజ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా ఐతే నాగచరణ్, ఉపాధ్యాయులుగా విద్యార్థులు బాధ్యతలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ ఉత్తమ ప్రదర్శన చేసిన వారిలో ప్రధమ బహుమతి బి. అక్షయకు, ద్వితీయ బహుమతి ఎస్. వర్షితకు ప్రదానం చేశారు. అదేవిధంగా ముఖ్య పదవుల్లో సేవలందించిన జ్ఞాన తేజ, నాగచరణ్, లక్ష్మణ్‌లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు రమేష్, తిరుపతి, రాజు, రవీందర్, చంద్రమౌళి, దేవేందర్, ఓంకార్ రెడ్డి, అశ్విని, స్వప్న, అసిఫియా, సుమన్, ఫైమా, రాధిక, సుమలత, ఉజ్వల, హబేదా, ఐలయ్య, షహీదా, శిరోమణి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు,బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు పేర్కొన్నారు