ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మండల కేంద్రంలో ని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించరు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, సేవాలాల్ బంజారా సమాజానికి మహనీయుడని, ఆయన జీవితం సేవ, త్యాగం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఆయన బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని కొనియాడారు.బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, డోర్నకల్ నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గులోత్తు రవి నాయక్, కౌన్సిలర్ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, బంజారా సంఘ నాయకులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.