కన్నులపండువగా శ్రీ తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం
శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్వామి వారి కళ్యాణం సందర్బంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కడియం
స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
తిరుమలనాథ స్వామి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. ఆ తర్వాత శ్రీ తిరుమలనాథ స్వామి వారికీ కళ్యాణ పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ వేడుకను తిలకించారు.అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. శ్రీ తిరుమలనాథ కళ్యాణమహోత్సవానికి హాజరై స్వామి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమలనాథ స్వామి ఆశీస్సులతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఉండాలని ప్రార్థించారు. రానున్న రోజులలో శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నీల నర్సింహులు, ఈవో వంశీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జులుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.