మంగపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పలు మండలాల్లో జెండా ఆవిష్కరణలు–ఎన్టీఆర్ సేవల స్మరణ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం–పార్టీ బలోపేతానికి పిలుపు ములుగు జిల్లా మంగపేట,ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పార్టీ జిల్లా నాయకులు దరావత్ దేవా నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణలు నిర్వహించి, పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దేవా నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ హామీలు విఫలమవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు.క్రమశిక్షణకు పేరుగాంచిన తెలుగుదేశం పార్టీపై ప్రజలు మళ్లీ ఆశలు పెట్టుకుంటున్నారని తెలిపారు.ములుగు జిల్లాలో పార్టీ నిర్మాణం బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అవినీతి రహిత,పారదర్శక పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.పేదల కోసం పోరాడిన నేతల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ఎల్.వి.జి నాయుడు, సత్యనారాయణ, హరి ప్రసాద్, కృష్ణారావు, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.స్థానిక నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మొత్తం మీద ములుగు జిల్లాలో నిర్వహించిన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి