సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు మరింత బలం చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో సి ఐ టీ యూ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యాలయాన్ని తుమ్మల రాజారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సి ఐ టీ యూ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత, వేతనాలు, సేవా నిబంధనల పరిరక్షణ వంటి అంశాల్లో ఈ కార్యాలయం కేంద్రంగా మారుతుందని తెలిపారు. సింగరేణి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనలో సంఘం మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో: బ్రాంచ్ అధ్యక్షుడు గాదే సంపత్, సెక్రటరీ ముత్యాల కార్తీక్, కాంట్రాక్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బలుగూరి మధు, సభ్యులు సుధాకర్, హరీష్, శంకర్, రఘురాం, రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్, మోరంపూడి పాండు, సిపిఎం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, కోలికపోగు సర్వేశ్వరరావు, రైతు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.నూతన కార్యాలయం ద్వారా ఉద్యోగులకు సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు మరింత బలం చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో సి ఐ టీ యూ నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యాలయాన్ని తుమ్మల రాజారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సి ఐ టీ యూ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత, వేతనాలు, సేవా నిబంధనల పరిరక్షణ వంటి అంశాల్లో ఈ కార్యాలయం కేంద్రంగా మారుతుందని తెలిపారు.
సింగరేణి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనలో సంఘం మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో: బ్రాంచ్ అధ్యక్షుడు గాదే సంపత్, సెక్రటరీ ముత్యాల కార్తీక్, కాంట్రాక్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బలుగూరి మధు, సభ్యులు సుధాకర్, హరీష్, శంకర్, రఘురాం, రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్, మోరంపూడి పాండు, సిపిఎం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, కోలికపోగు సర్వేశ్వరరావు, రైతు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.నూతన కార్యాలయం ద్వారా ఉద్యోగులకు సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని నిర్వాహకులు తెలిపారు.