ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఘన సన్మానం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.కోహెడ మాజీ ఎంపీటీసీ, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తిప్పారపు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను శాలువాలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఊళ్లేంగుల అభిరామ్ 470 మార్కులకు గాను 426 మార్కులు సాధించగా, సీఈసీ విభాగంలో గూడూరి భువనేశ్వరి 500 మార్కులకు గాను 475 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిష్టాత్మక ర్యాంకులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఇతర విద్యార్థులను కూడా అభినందిస్తూ వారి కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతిభ చాటుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. ఈ విజయాల వెనుక విద్యార్థుల కష్టంతో పాటు ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని పేర్కొన్నారు.అలాగే కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి,అధ్యాపక బృందం విద్యార్థులను మెరుగైన ఫలితాల దిశగా నడిపించడంలో చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళా