సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ సేవాగుణం
జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.వరంగల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ పల్లె నర్సింహా తన కుమార్తె పల్లె వైష్ణవి 21వ రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న సుమారు 20 మంది వృద్ధులకు రూ. 2200 విలువ చేసే 15 లీటర్ల నూనె డబ్బా, అన్నదానం, బిస్కెట్ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు. వృద్ధులు ఈ సేవా కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ దాతకు, ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, పల్లె నర్సింహా గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు.తన కుమార్తె 21వ రోజు సందర్భంగా వృద్ధులను సంతోషపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, పల్లె నర్సింహా మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుల సేవాభావాన్ని అధ్యక్షులు ప్రత్యేకంగా ప్రశంసించారు.