
ఈ69 న్యూస్ పర్వతగిరి ఏప్రిల్ 21
పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా గడ్డి మందు సేవించి మృతి చెందిన విషాద సంఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే… మృతుడు తోపుచర్ల రామచందర్ (41), తండ్రి కిషన్ రావు, వెలమ, ప్రైవేట్ ఉద్యోగి, సోమారం గ్రామానికి చెందినవాడు. ఇతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండగా తరచూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
తేదీ 20-04-2026 అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి వాంతులు చేసుకుంటుండగా, మృతుని తల్లి గమనించింది. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్కు తరలించి చేర్పించారు.
అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 10:43 గంటలకు రామచందర్ మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుని తమ్ముడు/ఫిర్యాదుదారు తోపుచర్ల ప్రవీణ్ రావు (38) పోలీసులకు ఫిర్యాదు చేయగా, పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు