సేవకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న లెజెండ్ దొ డ్డా
బలా భేష్ అంటున్న గ్రామ ప్రజలు”
ఉపాధి కూలీలకు నీడ,నీరు, ఓఆర్ఎస్ అందించిన సర్పంచ్ అమ్ములుబాబు ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని సత్తుపల్లి మండలంలో గల బేతుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములుబాబు) ప్రజల మన్ననలు పొందుతున్నారు.తనను నమ్ముకున్న,గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం లో దూసుకెళ్తున్నారు.మొన్న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేసవి ను దృష్టిలో పెట్టుకొని చల్లని త్రాగు నీరు కేంద్రం(చలివేంద్రం) ఏర్పాటు చేశారు.గత 30 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి చొరవ చూపి ఎస్సీ,ఎస్టీ,బీసీ వాడలలో పాత విద్యుత్ లైన్లలో కేబుల్,స్థంభాలు విద్యుత్ శాఖ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేయించారు. మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న త్రాగు నీటి పైప్ లైన్ల లీకేజీలకు మరమత్తులు చేయించారు.గ్రామ పంచాయతీ కార్యాలయంలో వచ్చిన గ్రామ ప్రజలు కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు.కార్యాలయానికి నూతన రంగులు వేసి సుందరంగా తయారు చేశారు.ఎంతో గొప్పగా నిర్వహించే అంకమ్మతల్లి తిరునాళ్ళ సమయంలో ఇబ్బంది పడకుండా రావి చెట్టు దగ్గర శ్రీ కృష్ణుడు కోవెల ప్రాంతంలో ప్రజల అవసరార్థం కల్వర్టు నిర్మించారు.
అక్కడితోనే ఆగకుండా బుధవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పని ప్రదేశం వద్దకు అమ్ములుబాబు స్వయంగా వెళ్లి పనులు చేస్తున్న తీరును పరిశీలించి ఎండను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారని తక్షణమే నీడ కోసం పని అనంతరం సేద తీరడానికి టెంట్ ఏర్పాటు చేయించారు,చల్లని త్రాగునీరు క్యానులు తెప్పించి దాహార్తిని తీర్చే దానికి నీరు పంపిణీ చేశారు,కూలీలకు ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఓ.ఆర్.ఎస్.ప్యాకెట్లు పంపిణీ చేశారు.గ్రామంలో దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవడానికి,అసాంఘిక శక్తులు చేసే అసాంఘిక కార్యక్రమాలను గుర్తించి గ్రామ ప్రజలను కాపాడేదానికి ప్రస్తుతం 08 నిఘా నేత్రాలను(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేస్తున్నారు.సేవా కార్యక్రమాలు చేస్తూ నిస్వార్థ పరిపాలన చేస్తున్న సేవకుడా బలా భేష్ అని ప్రజలు అభినందిస్తున్నారు.ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో:ఆయనతో పాటు వైస్ సర్పంచ్ చిట్టిమాదు చెన్నకేశవులు, వార్డుసభ్యులు,అభిమానులు పాల్గొన్నారు.