ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేయేషన్ కార్డుల మంజూరు
సమాజానికి ఉపయోగపడే వార్తలు అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి,
అక్రిడిటేయేషన్ కార్డుల ప్రక్రియ పారదర్శకతతో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్/జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్ స్నేహ శబరీష్ జిల్లాలో 2026-2028 సంవత్సరానికి సంబందిచిన మీడియా అక్రిడిటేయేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్ స్నేహ శబరీష్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ, దరఖాస్తుల సంఖ్య, పరిశీలన విధానం గురించి డీపీఆర్ఓను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే అక్రిడియేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా (447) ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయని, అట్టి దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి కార్లు అందించాలని,
ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలన్నారు. అక్రిడియేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,డీపీఆర్ఓ పి. రాజేంద్ర ప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సి.హెచ్ శ్రీనివాస్,ఈరగాని బిక్షం, వేముల అయోధ్య రామయ్య, నవాబ్,షేక్ అక్రం, ఎం.మోహన్ రెడ్డి, గాడిపెళ్లి శ్రీహరి, ఉమ్మగాని మధు, ఉప్పల రంగ, సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.