
ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 25
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత పదజాలంతో విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.ఢిల్లీ లిక్కర్ కేసు నేపథ్యంలో జైలుకు వెళ్లిన వ్యక్తి సీఎం పై విమర్శలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్లపై పోరాటం చేయాలని, మహిళల హక్కులపై స్పష్టమైన వైఖరి చూపాలని సూచించారు.నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాల హామీపై వివరాలు వెల్లడించాలని, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, వాటి కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై కూడా స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందుంచాలని కోరారు.రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హెచ్చరిస్తూ, నిజాయితీగా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. వెంటనే కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ప్రెస్ మీట్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, సోలో జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.