విద్యార్థి ఉద్యమ నేత బెల్లం కార్తీక్‌కు కీలక బాధ్యతలు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హనుమకొండ జిల్లా కన్వీనర్‌గా బెల్లం కార్తీక్ నియమితులయ్యారు.కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాస వర్గలో రాష్ట్ర అధ్యక్షులు రావుల కృష్ణ ఈ నియామకాన్ని ప్రకటించారు.గతంలో బెల్లం కార్తీక్ వరంగల్ మహానగర సంయుక్త కార్యదర్శిగా,వరంగల్ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్‌గా,రెండుసార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా,వరంగల్ మహానగర కార్యదర్శిగా సేవలందించారు.ఈ సందర్భంగా బెల్లం కార్తీక్ మాట్లాడుతూ,బాల్యం నుండి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లి జాతీయ భావాలను నింపుకున్నాను. అనునిత్యం దేశం కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను”అని తెలిపారు.తన నియామకానికి సహకరించిన ప్రాంత ప్రముఖ్ బాపురావుకి, వరంగల్ విభాగ్ సంఘటన మంత్రి పృథ్వీరాజ్ కి, విభాగ్ కన్వీనర్ సుజిత్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు