సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరహాలో ప్రతి నెల 1వ తేదీనే విడుదల చేయాలని, గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులను ప్రత్యేక అకౌంట్లో జమ చేసి పరిపాలన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ అన్నారం షరీఫ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గ్రామపంచాయతీల బలోపేతానికి, సిబ్బంది సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. సకాలంలో జీతాలు అందడంతో పాటు గ్రామాభివృద్ధికి నిధుల కొరత ఉండదని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొడుగు ఏకాంత,వార్డు సభ్యులు,గ్రామ పార్టీ అధ్యక్షులు గొడుగు రమేష్,మండల యూత్ అధ్యక్షులు గొడుగు వినయ్, రాపోలు అనిత-రవీందర్, దొంతమాల పవన్,కళ్యాణ్,కొండేటి కొమరమ్మ,గాడిపెల్లి రాజబాబు, సీనియర్ నాయకులు గొడుగు బిక్షపతి,సారంగపాణి, జక్కుల దర్గయ్య,చెడ్డపాక కుమార్ స్వామి, కన్నెబోయిన మల్లయ్య,గొడుగు వీరస్వామి,గ్రామపంచాయతీ సిబ్బంది రామచందర్,ఒగ్గు యాకయ్య,పసునూరి మహేందర్, సుగుణమ్మ,లచ్చమ్మ,రంగమ్మ, మంజుల,కారోబార్ గుండె యాగయ్య,ఎలక్ట్రిషన్ ఉమాగాని శ్రీనివాస్,వాటర్మెన్ దొంతమాడ రామచందర్,ఆకుల కుమారస్వామి,గ్రామస్తులు పాల్గొన్నారు.