ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం వెంటనే చేయాలి
- 2021 పేస్కేల్ సర్కులర్ ను సవరించాలి
- SWF ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం లింగమూర్తి, డిమాండ్
- ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం Dt28-05-26 స్థానిక సీఐటీయూ ఆఫీస్ ఖమ్మం నందు గుండు మాధవరావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ రవీందర్ రెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి పాత పెన్షన్స్ సౌకర్యం,ఉద్యోగ భద్రత, ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న మెడికల్ సౌకర్యాలు కొనసాగించాలని, అన్ని సెక్షన్ లో ఖాళీలు భర్తీ చేయాలి కార్మికులపై పెంచిన పనిభారాలు తగ్గించాలి 2021 పే స్కేల్ సంబంధించిన సర్కులర్ సవరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాలు రాంబాబు ప్రసంగించారు. రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ నివేదిక ప్రవేశపెట్టగా అన్ని డిపోల నుండి చర్చలో పాల్గొన్నారు గతంలో రీజియన్ వ్యాప్త కార్మికుల సమస్యలపై రీజనల్ మేనేజర్ గారికి మెమోరాండం విచ్చినామని ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చర్చించినారు లేదంటే భవిష్యత్తు కార్య చరణ ప్రకటిస్తామని చర్చించినారు కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది జూన్ 9న రీజియన్ జనరల్ బాడీ ఖమ్మంలో జరపాలని మహిళా సదస్సు జూన్ 16న జరపాలని ఈ సమావేశంలో ఖమ్మం డిపో నుండి గుగ్గిళ్ళ రోశయ్య సరిత వెంకటయ్య మధిర డిపో నుండి వెంకన్న మణుగూరు డిపో నుండి వై ఎన్ రావు శేఖరు లింగయ్య భద్రాచలం నుండి కే ప్రతాప్ బాలకృష్ణ డిఎన్ రావు కొత్తగూడెం డిపో నుండి ఈ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు