సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే రాగమయి చర్చ
ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో శనివారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ను శనివారం సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం కలెక్టర్ దివాకర టి.ఎస్. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.ఈ సమావేశం సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.