పెండింగ్ బిల్లులు చెల్లింపులపై నిరసన చేస్తున్న బీఆర్స్ నాయకుల అరెస్ట్
నర్సంపేటలో మాజీ సర్పంచుల బకాయిల చెల్లింపుల కోసం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించుతు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొడాలి రవి, మాజీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, దాసురు నాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, గుడిసెల రాంబాబు తదితరులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.