భవన నిర్మాణ కార్మికుల రేట్ల పెంపకం బాధాకరం
ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం తీగల లాజర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు పటేల్ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఐక్యమత్యం లోపం వల్ల మొట్టమొదటిసారిగా లేబర్ ఆఫీసులో ఉడత బత్యంగా రేట్ల పెంపకం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు లేబర్ ఆఫీసులో జరిగే అవకతవకలను అరికట్టాలని రాడ్ బెండింగ్ కార్మికులు ఎత్తుకుపోయేత్తు 5 6 7 బిల్డింగ్ అంతస్తులపై ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఎత్తు పీటలపై ఎలాంటి రక్షణ కిట్టు లేకుండా పనిచేస్తున్నారు ఇలా పని చేస్తూ పైనుంచి జారిపడి ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు కనుక సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు రక్షణ కిట్టు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే యాజమాన్య వర్గాన్ని అసోసియేషన్ లో నమోదయి ఉన్న మేస్త్రులకు మాత్రమే పని ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించుకోవాలని బాధ్యత లేని వారికి ఇచ్చి నిర్మాణ లోపాన్నికి గురి కాకూడదని యజమాని వర్గాన్ని కోరారు నిర్మాణ రంగా కార్మికులు ఐక్యత గా లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాణ రంగ కార్మికులు లేబర్ బోర్డులో నూటికి 60 శాతం మాత్రమే నమోదయి ఉన్నామని మిగతా 40 శాతం కూడా నమోదు చేసుకోవాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు అలాగే రెన్యువల్ అయిపోయిన కార్డులను 90 రోజులు లోపే చేయించుకుంటే రెన్యువల్ అవుతున్నాయి అంతకుమించితే కావట్లేదు కనుక నిజమైన కార్మికుడికి షరతులు లేకుండా ఎప్పుడైనా రిన్వల్ చేయించుకునేలా ఏర్పాటు చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 29 చట్టాలకు కుదించి అందులో నుంచి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురాబోతుంది ఈ నాలుగు లేబర్ కోడ్లవల్ల కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఆ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఉబ్బని దాసు యల్ సైదారావు కాంపాటి పుల్లయ్య నారపాక అవినాష్ నారపాక ఉపేందర్ కోట రాజు షేక్ బాషా నవీన్ అనిల్ రమేష్ శాంతయ్య భద్రయ్య రాము వెంకన్న భాస్కర్ సీతయ్య కాంతయ్య మోహన్ రావు వెంకటేశ్వర్లు సతీష్ నరసింహారావు గురవయ్య వీరబాబు తదితరులు పాల్గొన్నారు