°సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
°సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం జమాల్పురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జెండా వందనం చేసి,జాతీయ గీతం ఆలపించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కనుకయ్య యాదవ్ మాట్లాడుతూ,”అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం మనందరి బాధ్యత. పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని,గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి”అని పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ,తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందని, గుట్కా, పాన్ మసాలా, తంబాకులకు వ్యతిరేకంగా ఆశా కార్యకర్త కారింగుల జ్యోతక్క పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్,ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్,మహిళా సంఘాల సభ్యులు,యువకులు, రైతులు,కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.