అంబాల ప్రశాంత్
హనుమకొండ తెలుగు గళం జూన్ 02
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్ మాట్లాడుతూ,నాటి పార్లమెంట్లో బీఎస్పీకి ఉన్న 39 మంది ఎంపీల బేషరతు మద్దతు వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్కు అప్పట్లో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి ఎలాంటి రాజకీయ బేరసారాలు లేకుండా తెలంగాణకు మద్దతు ప్రకటించారని అన్నారు.లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి బీఎస్పీకి ఉన్న 39 మంది ఎంపీల మద్దతు తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసం బహుజన తెలంగాణ నిర్మాణానికి బీఎస్పీ కట్టుబడి ఉందని అంబాల ప్రశాంత్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల భరత్, నియోజకవర్గ ఇన్చార్జి సీత రాజ్‌కుమార్, పశ్చిమ ప్రధాన కార్యదర్శి నద్దునూరి దీపక్, అంబాల జాన్, మున్ని, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు