తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం మనందరి బాధ్యత.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని పిలుపునిచ్చారు.అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ గీతం ఆలపించి, మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు,యువకులు పాల్గొన్నారు.