మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్తో పాటు జిల్లా నాయకులు హాజరు
స్వర్గీయ మాజీ ఎంపీపీ వర్ధినేని దేవేందర్ రావు విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
°మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్తో పాటు జిల్లా నాయకులు హాజరు
వరంగల్ జిల్లా:పర్వతగిరి పట్టణ కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మాజీ ఎంపీపీ వర్ధినేని దేవేందర్ రావు విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాటోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ,”తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎన్నో ఏళ్ల ఉద్యమాలు,త్యాగాలు, అమరవీరుల బలిదానాల ఫలితం. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు,విద్యార్థులు, ఉద్యోగులు,మేధావుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదు”అని అన్నారు.”రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం,అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది” అని తెలిపారు.జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు మాట్లాడుతూ,ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రైతులు, మహిళలు, యువత,విద్యార్థులు, కార్మికుల సంక్షేమం కోసం మహాలక్ష్మి, రైతు భరోసా,గృహ జ్యోతి,ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా సానుకూల మార్పులు తీసుకువస్తున్నాం అని అన్నారు.సర్పంచ్ చిదురు శంకర్ మాట్లాడుతూ,ప్రజా పాలన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం.ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు,రోడ్లు, తాగునీరు, విద్య వైద్యం, సాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని పేర్కొన్నారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ, ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, అధికారులు,యువజన నాయకులు,మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు