మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం
మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం
తెలుగు గళం న్యూస్ ఐనవోలు/జూన్ 2
హనుమకొండ జిల్లా:అయినవోలు మండలం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ‘పల్లె ప్రకృతి’ అంశంపై నిర్వహించిన నాట్య ప్రదర్శన పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఒంటిమామిడిపల్లి విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు.జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,జిల్లా విద్యాశాఖాధికారి మరియు పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. శివకుమార్,పాఠశాల కమిటీ చైర్మన్ కడుదూరి మోహన్, వైస్ చైర్మన్ ఆరే అశోక్,పీఈటీ గణేష్‌లు విజేత విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన విద్యార్థులకు,శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.