గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, ప్రజలను బెదిరిస్తున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు
డీఎస్పీ, సీఐ లకు ఫిర్యాదు
భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, ప్రజలను బెదిరిస్తున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ డీఎస్పీ అరుణ్ కుమార్ కి మరియు భద్రాచలం సీఐ నాగరాజు కి ఫిర్యాదు చేశారు.
సంతోష్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రమని, ఈ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ వ్యవహారాల వెనుక ఉన్న వ్యక్తులు, ముఠాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని
ప్రజల భద్రత, శాంతి భద్రతలు భద్రాచలం క్షేత్ర గౌరవాన్ని పరిరక్షించే దిశగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.