డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరులకు నివాళి
డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరులకు నివాళి
తెలుగు గళం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జూన్ 02
రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు.ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, “సోనియమ్మ గారి చొరవతో, వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను, ప్రజా ప్రభుత్వం ప్రగతి పథంలో నడిపిస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు.”కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలతో తెలంగాణ ప్రజల కలలు సాకారం చేస్తోంది.అమరులు కన్న బంగారు తెలంగాణను సాధించే బాధ్యత మనందరిపై ఉంది” అని జిల్లా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, రాష్ట్ర సీనియర్ నాయకులు మోత్కూరి ధర్మారావు, బిక్కసాని నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రసాద్ బాబు, మంద హనుమంతు, మండే హనుమంతరావు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, జగన్, బట్టు మురళి ప్రజాప్రతినిధులు, అధికారులు, డీసీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.