మేరాజ్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్
- పాలిసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహ్మద్ మహబూబ్ అర్ఫాజ్ అలీ కి ఘనసన్మానం
- మన జీవితాలను మార్చగల శక్తి ఒక్క చదువుకే ఉంది
- మేరాజ్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్
సత్తుపల్లి, ఆర్ సి,జూన్ 05(తెలుగుగళం) న్యూస్:
తెలంగాణ పాలిసెట్ -2026(పాలిటెక్నిక్) ఎంట్రన్స్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధమ స్థానం సాధించి సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర స్థాయికి తీసుకు వెళ్ళిన సత్తుపల్లి విద్యార్ధి మహ్మద్ మహబూబ్ అర్ఫాజ్ అలీ ని శుక్రవారం ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించారు వెంగళరావు నగర్ మేరాజ్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ మహేంద్ర పాషా, మాజీ కౌన్సిలర్ షేక్ నాగుల్ మీరా, సలీం , షేక్ ఇస్మాయిల్ కరీముల్లా తదితరులు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ మాట్లాడుతూ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దని అవసరమైతే ఒక పూట పస్తు ఐనా సరే ఉండండి కానీ పిల్లలను చదివించండి అని తెలిపారు. మన జీవితాలను మార్చగల శక్తి ఒక్క చదువుకే ఉందని,విద్యార్ధులలో అసాధారణ ప్రతిభ ఉంటుందనడానికి నిదర్శనం తెలంగాణ పాలిసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మహ్మద్ మహబూబ్ అర్ఫాజ్ అలీ యే నని, భవిష్యత్తులో బాగా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచేలా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దలు,వెంగళరావు నగర్ వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.