ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి.
ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి.
ఖమ్మం,జూన్. 5(తెలుగు గళం) న్యూస్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఐసిడిఎస్ చింతకాని సెక్టార్ సూపర్వైజర్ సంధ్యారాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చింతకాని 2,3 అంగన్వాడి కేంద్రంలో టీచర్ భద్ర, బేబీ కుమారి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి మొక్కలు నాటడం, పెంచడం ద్వారా అహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణ తో పాటు స్వచ్ఛమైన గాలిని పిలుస్తామన్నారు. మనం నిత్యజీవితంలో వినియోగించు వస్తువులు పదార్థాల వలన కాలుష్యం విడుదలై వాతావరణం కలుషితమవుతుంది కాబట్టి మనమందరం మొక్కలు నాటడం,చెట్లను పెంచడం ద్వారా భావితరాల వారిని కాలుష్యం బారిన పడకుండా చూడొచ్చు అన్నారు. మొక్కలు నాటి సంరక్షించినప్పుడే బాధ్యత పూర్తవుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు క్రమశిక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ తెలియజేసే విధంగా విద్యాబోధన నిర్వహిస్తున్నామని అన్నారు.అనంతరం భూమిని పునరుద్ధరించడానికి,ఎడారీకరణను నివారించడానికి, కరువును ఎదుర్కోవడానికి,మన చుట్టూ ఉన్న వాతావరణం మెరుగుపరచడానికి మా పూర్తి మద్దతును అందజేస్తామని తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు.