ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
మున్సిపాలిటీ కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ కార్మికుల వేతన కోతకు కారణమైన జీవో నంబర్ 69ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ నేతృత్వంలో కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి పురపాలక సంఘంలో పనిచేస్తున్న 150 మంది కార్మికులకు ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నంబర్ 69 ద్వారా రూ.5,000 వరకు వేతనాలు తగ్గే ప్రమాదం ఉందన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సింది పోయి, ఉన్న జీతాలను తగ్గించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు తగ్గిస్తే కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని, కార్మికుల పొట్టకొడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ జీవోను రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికులు ఎడ్ల సాయిలు, కార్తీక్, రమేష్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.