ఒక సీసీ కెమెరా 100 మంది సెక్యూరిటీ సిబ్బందితో సమానం: ఏసీపీ వెంకటేశ్వర్లు

ఈ69 న్యూస్ | పర్వతగిరి, అక్టోబర్ 12

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని తెలంగాణలో ప్రముఖ యాత్రాస్థలమైన అన్నారం షరీఫ్ దర్గాలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రామంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించడం సులభమవుతుందని తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది సెక్యూరిటీ సిబ్బందితో సమానమని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను మెరుగుపరచవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో సీఐ ఆర్. సంతోష్, ఎస్సై భోగం ప్రవీణ్, గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గోడుగు ఏకాంత సారయ్య, గ్రామ పాలకవర్గ సభ్యులు, సొసైటీ చైర్మన్ పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, అన్నారం షరీఫ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాషాబోయిన రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *