ములుగు జిల్లా సంక్షేమ అధికారిని. ఈపి ప్రేమలత .ములుగు జిల్లా సంక్షేమ అధికారిని. ఈపి ప్రేమలత .
  • నోటిఫికేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు.
  • అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించుటకు ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి.
  • ములుగు జిల్లా సంక్షేమ అధికారిని. ఈపి ప్రేమలత .
  • తెలుగు గళం ములుగు. అక్టోబర్ 30
  • ములుగు జిల్లాలోని ఐసిడిఎస్ తాడ్వాయి – వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 31 అంగన్వాడి టీచర్ల పోస్టులు. 104 అంగన్వాడి హెల్పర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించుటకు ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి తెలిపారు . తాడ్వాయి ప్రాజెక్టు అంగన్వాడి టీచర్ పోస్టులు 04-11-2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు. వెంకటాపురం ప్రాజెక్టు అంగన్వాడి టీచర్ పోస్టులకు . 05-11-2026 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు . తాడ్వాయి ప్రాజెక్టు అంగన్వాడి హెల్పర్ పోస్ట్లు 06-11-2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు . వెంకటాపురం ప్రాజెక్టు అంగన్వాడి హెల్పర్ పోస్టులు ..07-11-2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పై తేదీలలో ములుగు లోనే ఐ డి ఓ సి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడును. సంబంధిత సిడిపిఓ ఆఫీసు నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలనలో అర్హులని ధ్రువీకరించబడిన వారికి మాత్రమే పైన తెలిపిన తేదీలలో నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ములుగు జిల్లా సంక్షేమ అధికారి . ఈపి. ప్రేమలత సూచించారు. అర్హుల జాబితాను సంబంధిత మండల పంచాయతీ. మండల తహసిల్దార్ . సిడిపిఓ కార్యాలయాల్లో మీ సమాచార నిమిత్తం ఉంచబడిందని తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *