శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 ( తెలుగు గళం ) న్యూస్:
నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ న్యూఢిల్లీ సంస్థ తెలంగాణ రాష్ట్ర సభ్యుడుగా బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు 2026 అక్టోబర్ 30 నుండి 2029 అక్టోబర్ 29 వరకు మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలో కొనసాగరన్నారు ఈ మేరకు కౌన్సిల్ నుండి అధికారిక నియామక ఉత్తర్వులు జారీ అయినట్లు ఆయన వెల్లడించారు ఫైల్ నెంబర్ 1596851/11001/ నేచర్ వెల్ఫేర్ 2026 ప్రకారం ఈ నియామకం జరిగినట్లు తెలిపారు ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర సభ్యుడిగా బాధ్యతలు అప్పగించిన నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సెంట్రల్ చైర్మన్ రాహుల్ ద్వివేది కాంపిటేంట్ అథారిటీ సెంటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిజాయితీతో అంకిత భావంతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు ముఖ్యంగా ప్రకృతి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపొందించడం పర్యావరణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యతరిస్తూ పని చేస్తానని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానాని వెల్లడించారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులోనూ ప్రజల ఆశీస్సులు ప్రోత్సహం అందించాలని కోరారు. మూడేళ్ల పాటు లభించిన ఈ బాధ్యతలను ప్రజాసేవకు ప్రకృతి పరిరక్షణకు ఒక మంచి అవకాశం గా భావిస్తున్నట్లు బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు
బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి నియామకం