500 మందికి పైగా పాస్టర్లు, సంఘ పెద్దలు హాజరు
హనుమకొండ (తెలుగు గళం-ఈ69న్యూస్) నవంబర్ 02

మెలిటా ఛారిటబుల్ ట్రస్ట్, హోప్ ఫర్ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోప్ కమ్యూనిటీ కేర్ లీడర్స్ సమావేశాన్ని సోమవారం హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి 500 మందికి పైగా చర్చి పాస్టర్లు, సంఘ పెద్దలు, నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమాజ సంక్షేమం, ఆధ్యాత్మిక సేవలు, ప్రజలకు అందించాల్సిన సేవా కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సమాజ అభివృద్ధిలో ఆధ్యాత్మిక నాయకుల పాత్ర, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాల్సిన ఆవశ్యకతను వివరించారు.భారీ సంఖ్యలో పాస్టర్లు, సంఘ నాయకులు పాల్గొనడంతో సమావేశం విజయవంతంగా ముగిసింది.