బాధితుల కోణమే అబ్బాస్‌ ‘చీకటి తరువాత’ | సమాజ వాస్తవాలను ఆవిష్కరించిన పుస్తకంబాధితుల కోణమే అబ్బాస్‌ ‘చీకటి తరువాత’ | సమాజ వాస్తవాలను ఆవిష్కరించిన పుస్తకం

పుస్తకాన్ని ఆవిష్కరణ ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె శ్రీనివాస్‌
చరిత్రలో జరిగిన తప$లను పునరావృతం కానొవ్వొద్దని వ్యాఖ్య
విమోచన దినాన్ని ఎవరికివారు అన్వయించుకుంటున్నారు
యువ పురస్కార గ్రహిత పసునూరి రవీందర్‌

తెలంగాణ సాయుధ పోరాటంలోని బాధితుల కోణమే ‘చీకటి తరువాత’ పుస్తకం
ఇతివృత్తమని సాహితి వేత్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌‌లోని
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
ఎండీ అబ్బాస్‌ ‌రచించిన ‘చీకటి తరువాత’ టీపీఎస్‌‌కె అధ్యక్షులు భూపతి
వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.
శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన
పొరపాట్లు, తప$లు మళ్లీ జరగకుండా చూసుకోవడమే చీకటి తరువాత పుస్తక
ఉద్దేశ్యమని వ్యాఖ్యానించారు. భయంకరమైన దుర్మార్గాలను ఈ పుస్తకం
బయటపెట్టిందన్నారు. సరైన సమయంలో సరైన పుస్తకాన్ని అబ్బాస్‌ ‌రాశారని
అభినందించారు. ఆలోచించాల్సిన అవసరాలను సృష్టించడమే పుస్తకాల ప్రాధాన్యత
అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం లేదా హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌చర్య
గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు. సొంత జీవితంలోని
అనుభవాలను ఇందులో పేర్కొన్నారని వివరించారు. చేదు విషయాలను జ్ఞాపకం
చేసుకోవడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. మతంతో సంబంధం లేకుండా
మానవతను చాటుకోవడమే పుస్తకంలోని ఇతివృత్తమని తెలియజేశారు. చేదు అంశాల
స్మరణ పుస్తకంలో ఉందన్నారు. అనేక మౌళిక ప్రశ్నలను చీకటి తరువాత పుస్తకం
లేవనెత్తుతుందన్నారు. మనుషుల మధ్య అంతరాలు, అడ్డుగోడలను సృష్టించడమే తాజా
రాజకీయ నాయకుల ఆలోచనులుగా ఉన్నాయని గుర్తు చేశారు. అందరిని
కలుపుకుపోకుండా ఇతరులుగా చూసే పరిస్థితిని ఈ పుస్తకం వివరిస్తుందన్నారు.
జ్ఞాపకం నేడు రాజకీయ ఆయుధంగా మారిందన్నారు. బాబర్‌ ‌రామాయాలన్ని ధ్వంసం
చేశాడా అనే సంగతి చరిత్రలో లేదన్నారు. చరిత్రను అడ్డంపెట్టుకుని
వర్తమానంలో ప్రజల మధ్య భయాన్ని రేకెత్తించడంతోపాటు విభజిస్తున్నారని
వివరించారు. చరిత్రను ద్వేషపూరితంగా అన్వయం చేయడం ఆధునిక రాజకీయాల్లో
సాధారణంగా మారిందని అభిప్రాయపడ్డారు. దేశంలో పేదలు, నిరుపేదలు
నీతివంతులని చెప్పారు. వాళ్లకు రావాల్సిన సంపదను కొద్దిచేతుల్లోకి
వెళుతుంటే, పేదలు ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం చేసుకోవాలని చెప్పారు.
దేశంలో కొద్దిమంది పెద్దల చేతుల్లో మెజారీటీ ప్రజలు నష్టపోతున్నారని
చెప్పారు. ద్వేషంతో సహజీవనం అంతసులభం కాదన్నారు. మనిషిని పక్కవాళ్లు
ద్వేషిస్తున్నారని చెప్పారు. పాత సంఘటనలు, విషయాలను అవగాహనలేనితనంలో
భయాందోళలకు గురవుతున్నారని తెలిపారు. మైనార్టీలను చూసి మెజారీ తరగతులు
భయపడాల్సిన భావనలు సృష్టిస్తున్నవారిని తెలిపారు. విదేశాల్లో జరుగుతున్న
పరిణామాలు సైతం ఈ తరహా భావనలకు అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు.
విషపూరితమైన ఆలోచనలతో మనుషులంతా విషపూరితంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం
చేశారు. ప్రజల మనుస్సులు, ఆలోచనలను ద్వేషపూరితం చేసేందుకు
ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గతంలో పెద్దమనుషులు ప్రజలంతా కలిసిమెలిసి
ఉండాలని చెప్పేవారనీ, ఈ కాలంలో అలా చేయకుండా ద్వేషభావాలను నింపుతున్నారని
విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా
హిందువులు చేసిన పోరాటం కాదనీ, కమ్యూనిస్టుల నేతృత్వంలో భూమి, భుక్తి,
దోపిడి విముక్తి కోసం చేసిందన్నారు. తాజాగా పాలకులు దాన్ని
వక్రీకరిస్తున్నారని చెప్పారు.
బాధితుల కోణమే చెప్పేదే ‘చీకటి తరువాత’
పసునూరి రవీందర్‌
కేంద్ర యువ పురస్కార గ్రహిత పసునూరి రవీందర్‌ ‌మాట్లాడుతూ పుస్తకాలు చాలా
వస్తుంటాయనీ, అందులో ఈ పుస్తకం ప్రత్యేకమన్నారు. గతం గురించి వర్తమాన
సందర్భంలో చెప్పడం ద్వారా సమాజానికి చక్కని సందేశం ఇచ్చారన్నారు.
మార్స్సిజం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అబ్బాస్‌
‌చేస్తున్నారని గుర్తు చేశారు. ఆయన్ను ఉద్యమకారుడిగా నాకు తెలుసనీ,
చరిత్రను పుస్తకంగా రాస్తారని నేను ఊహించలేదన్నారు. దీనికి ముందుమాట
రాఘవులు, వీరయ్య రాశారని తెలిపారు. చీకటి తరువాత అంటే 1948 తర్వాత జరిగిన
పరిణామాలని గుర్తుచేయడమేనని చెప్పారు. విమోచన దినం గురించి నేడు ఎవరి
కోణంలో వారికి అనుకూలంగా రాసుకోవడం అలవాటుగా మారిందన్నారు. నిజం
చెప్పులేసుకునే లోపే అబ్బద్దం ప్రపంచమంతా తిరిగొస్తుందనే సామెతను
ఈపుస్తకం సారాంశం స్పష్టం చేస్తున్నదని వివరించారు. చరిత్ర వక్రీకరణ
జరుగుతున్నదని చెప్పారు. చరిత్రను రాయాల్సిన వాళ్లు రాస్తేనే దాని
గొప్పతనం అర్థమవుతుందన్నారు. జెన్‌‌జీ వచ్చిన తరువాత బత్తాయిల బలుపు
అణిగిందని అభిప్రాయపడ్డారు. ముస్లింలపై ద్వేషం పెంచుతూ హిందువులను
రెచ్చగొడుతున్నారని చెప్పారు. 1948 తర్వాత ఎంతోమంది అమాయకులు చనిపోయారనీ,
వాళ్ళ గురించి నిజాలను ఈ పుస్తకం బయటపెట్టిందన్నారు. అప్పట్లో ప్రభుత్వం
నియమించిన సుందరలాల్ కమిటీ చెప్పిన విషయాలు చాలా మందికి తెలియవని
చెప్పారు. ప్రతి జిల్లాలో ఈ పుస్తక పరిచయ సభలు పెట్టాలని సూచించారు.
ప్రభుత్వం13 కోట్ల ఓట్లను గల్లంతు చేసిన విషయాలను రయిచతలు తీసుకెళ్లాలని
అభిప్రాయపడ్డారు.

లక్షలు పుస్తకాలు ముద్రించాలి
కవి యాకూబ్‌
అబ్బాస్‌ ‌రాసిన చీకటి తరువాత పుస్తకాన్ని లక్షలాదిగా ముద్రించాలని కవి
యాకూబ్‌ సూచించారు. పాఠకులు మెచ్చేలా నవల రాశారని అభినందించారు. మనుషులు,
వారి మానవత్వాన్ని ఈ పుస్తకం చాటిచెప్పిందని గుర్తు చేశారు. మనం
చేయాల్సిన పనిని ఈ పుస్తకం గుర్తుచేస్తుందని తెలిపారు. మనుషుల గురించి
రాయాలంటే అంతకుముందు మనుషుల కనీళ్ళ గురించి అర్థం చేసుకోవాలని
అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో అది కనపడిందని చెప్పారు. మెజారిటీ,
మైనారిటీ మధ్య భేదభావంతో బతుకున్నమా ? అనే సందేహాం లేవనెత్తుతుందన్నారు.

సాయం చేయడమే పొరుగువాళ్ల పని
నవతెలంగాణ పీచర్స్‌ ఎడిటర్‌ ఆనందచారి
అబ్బాస్‌ ‌రాసిన పుస్తకంలో మానవీయ సంఘటనలు ఎన్నో ఉన్నాయని నవతెలంగాణ
పీచర్స్‌ ఎడిటర్‌ ‌కె ఆనందచారి అన్నారు. అద్భుతమైన సంఘటనలు ఈ నవలలో
ఉన్నాయని గుర్తుచేశారు. భయం గురించి వర్ణించి చెప్పారని వివరించారు.
చరిత్ర నేపథ్యంలో వర్తమానంలో జరుగుతున్న పరిణామాలకు పుస్తకం అద్దం
పట్టిందన్నారు. సాయం చేయడమే పొరుగు వాళ్ల పని అర్థం వచ్చేలా రచన
ఉందన్నారు. రయిచత పొరుగువాళ్లకు గొప్ప నిర్వచనం ఇచ్చారని అభినందించారు.
మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ‌చంద్రకుమార్‌ మాట్లాడుతూ కుల, మతాల పేర
ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. మనుషుల్లోకి మతాన్ని ఎక్కించడం
ద్వారా ద్వేషం నింపుతున్నారని వివరించారు. మానవ వృదయం ఇతరులకు
తొడ్పాడాలని అన్నారు.
సృష్టిని, విశ్వాన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ద్వేషానికి అవకాశం
ఉండదన్నారు. సత్యాన్నీ దాచిపెట్టి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని
చెప్పారు. రచయిత సలీమ మాట్లాడుతూ సోషల్‌‌మీడియాలో పోస్టు పెడితే అనవసర
కామెంట్లు చేస్తున్నారని అన్నారు. నిజాలను అర్థంచేసుకోకుండా ఇష్టానుసారం
వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. చీకటి తరువాత పుస్తక రచాయిత ఎండీ
అబ్బాస్‌ ‌మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన ఘటనల సారంశమే ఈపుస్తకమని
అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్త కోణం ఆవిష్కరించినట్టు
వివరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈపుస్తకాన్ని రాసినట్టు చెప్పారు. నా
చుట్టూ జరిగిన ఘటనలను అక్షర రూపం చేసే ప్రయత్నమే చీకటి తరువాత పుస్తకమని
తెలియజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *