బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పాషా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సహకారం అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం పట్ల బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పాషా హర్షం వ్యక్తం చేశారు. మునగాల మండల కేంద్రంలోని గురువారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కొరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి పేదవారికి విద్యను అందుబాటులో తెచ్చిందని. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ రూట్ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఈ రీడింగ్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.