గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం మరియు ఇతర సంఘాల ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిలను జరపాలని నిర్ణయించింది. ఈరోజు జిల్లా కలెక్టర్ చాంబర్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ దాస్యం వినయ్‌భాస్కర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ పాల్గొన్న ఈ *కార్యక్రమంలో బ్యానర్ కూడా పెట్టకుండా జిల్లా అధికారులు తూతూ మంత్రంగా నిర్లక్ష్యంగా అంటిముట్టనట్టుగా వర్ధంతి సభ జరిపారని. అలాగే ఆయన చిత్రపటం మీద తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు అని కూడా *రాయకుండాఅతని చిత్రపట* ఫ్లెక్సీ.కొట్టించారని ఈ వర్ధంతి జరపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు .
భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకలి విముక్తి కోసం ప్రజలను చైతన్యవంతం చేసి నైజాం రధాకర్లకు భూస్వాములకు ప్రజలపై అఘాయిత్యాలు చేస్తూ రౌడీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిపి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా అమరుడైన దొడ్డి కొమరయ్య అమరవీరుని వర్ధంతిని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా. పట్టీ పట్టనట్టుగా వ్యవహరించి జరపడం సరి అయింది కాదని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.