జలదిగ్బంధమైన లోతట్టు ప్రాంతాలను సందర్శించిన సిపిఎం బృందం
Jangaonగత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు జనగామ పట్టణమంతా జలమయమై ప్రజలందరినీ సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ జిల్లా సుంచు విజేందర్ కమిటీ సభ్యులు అన్నారు. గురువారం రోజున సిపిఎం బృందం గురువారం లోతట్టు ప్రాంతాలను సందర్శించి వర్షపు నీటిలో మునిగిపోయిన ప్రాంతాలను సిపిఎం బృందం సందర్శించి నీటిలో మునిగిపోయిన తడిసి ముద్దయిన వస్తువులు బాధిత కుటుంబాలను సిపిఎం బృందం పరామర్శించి అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర వచ్చిన తర్వాత అనంతరం ఏర్పడ్డ మొదటి మున్సిపాలిటీ జనగామ జనగామ పట్టణం రోజు రోజు విస్తరిస్తున్న మున్సిపల్ పాలకవర్గం జనగామ పట్టణంలో నుండి విడుదలవుతున్న మురికి నీటిని బయటికి పంపడంలో ప్రణాళిక వేయడంలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందన్నారు. గత వారం రోజులుగా నిరాటంకంగా కురుస్తున్నవర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై ఇంట్లో ఉన్న బియ్యం నిత్యవసర వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయినాయని అన్నారు. వర్షం నీరు ఇండ్ల లోకి చేరడంతో విష సర్పాలు ఇండ్లలోకి వచ్చాయన్నారు. రాత్రంతా నిద్ర లేక ఇళ్లలోకి చేరిన నీరును ఎత్తిపోస్తూ తినడానికి తిండికి లేక అనేక అవస్థలు పడుతున్నారని వారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరుతో ఇండ్లు మునిగిపోయిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు డిమాండ్ చేశారు. వర్షానికి కూలిపోయిన ఇండ్లకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని. వర్షానికి తడిసి ముద్దయిన వారికి పదివేల రూపాయలు నష్టపరిహారం వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సందర్శించి తగు చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సమీకరించి సిబ్బంది ఇస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణ లింగం నాయకులు భాషాపాక విష్ణు కచ్చ గళ్ళ వెంకటేష్ దేవులపల్లి యాదగిరి కొన్నే శాంత పార్నంది మల్లమ్మ గడ్డం జ్యోతి దండం పోచమ్మ ఊడుగుల నర్సమ్మ ఉడుగుల వజ్రమ్మ యాదగిరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.