
బీచ్ రాజ్ పల్లి హరిత సోయగం పై అసెంబ్లీ లో KTR ప్రశంస
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పై గ్రామస్తుల సంబురాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బాగంగా శనివారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐ టీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రం లో అమలవుతున్న అవెన్యూ ప్లాంటేషన్ తో పల్లెలు హరిత పూల సోయగం తో స్వాగతం పలుకుతున్నాయి అని తెలిపారు. యాభై ఎండ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు దుర్భరమైన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కు వివరిస్తూ రాష్ట్రం లోని 16000వేల నర్సరీ ల్లో ఈ విధమైన వాతావరణం ఉందని బీచ్ రాజ్ పల్లి రహదారి ప్రగతి ని చిత్రాలతో కలిసి అసెంబ్లీ వేదిక గా చూపించారు. ఈ విషయాన్ని సామాజిక మాద్యమల ద్వార తెలుసుకున్న గ్రామస్థులు సోషల్ మీడియా లో వైరల్ చేశారు. గ్రామానికి చెందిన జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడి పూడి నవీన్ రావు ప్రత్యేక దృష్టి, సర్పంచ్ నాతి కృష్ణ, పంచాయితీ సెక్రటరీ లెనిన్ ల విశేష మైన కృషి పై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు సర్పం చ్ కృష్ణ, కార్యదర్శి లెనిన్ లను ఫోన్ ద్వార ప్రశంసించారు.