తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
◆28 జనవరి 2024న మూడవ మహాసభ జనగామ జిల్లా కేంద్రంలో ఖరారు
       జనగామ జిల్లా కేంద్రంలో  9 - 12 -2023 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశానికి జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నరాముగారి విజయ గణేష్ ,జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి యాకయ్య హాజరై మాట్లాడుతూ మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు కీ౹శే౹సాంబరాజు రవి అభిప్రాయం మేరకు రాష్ట్ర మూడవ మహాసభ  జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ సిద్దంగా ఉందన్నారు.రాష్ట్ర,జిల్లా కమిటీ రివ్యూ మీటింగ్ లో చర్చించిన తర్వాత  28 జనవరి 2024న మూడవ మహాసభను నిర్వహించడానికి సిద్దమైంది. కావున  తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కమిటీ సభ్యులు మరియు రజక కులస్తులు సహాకరించాలని కోరారు.
     జాతీయ ఉపాధ్యక్షులు ఏదునూరి గట్టేశం,ఉల్లెంగల యాదగిరి మరియు జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మూడవ మహాసభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కమిటీ సభ్యుడికి మరియు జిల్లా రజక కులస్తులకు ఉందన్నారు.
   రాష్ట్ర ఉపాధ్యక్షులు మిన్నలాపురం జలంధర్ ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న మాట్లాడుతూ కీ౹శే౹ సాంబరాజు రవి  తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
  ముఖ్యనాయకుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు , జిల్లా ముఖ్యసలహాదారులుపాటి రమేష్ జిల్లా సలహాదారులు మెంతన కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.