మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈనెల 15 నుండి 17 వరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ (AIOCD) ఆధ్వర్యంలో జరుగు జాతీయ కెమిస్ట్ సమావేశాలకు తొలిసారిగా భద్రాచలం కు చెందిన కెమిస్ట్ పరిమి సోమశేఖర్ కు ఆహ్వానం అందినదిగత 23 సంవత్సరాలగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పాల్వంచ భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో 12 మండలాలకు డివిజన్ సెక్రెటరీగా మరియు డివిజన్ అధ్యక్షులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించిన సోమశేఖర్ కు ఈ అవకాశం రావడం పట్ల డివిజన్ వ్యాప్తం గా కెమిస్ట్ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారుప్రస్తుతం పరిమి సోమశేఖర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా తెలంగాణ టిటిసిడిఏ సభ్యుల గా కొనసాగుతున్నారు.