భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, ఈరోజు అనగా 11.12.23 న మద్యాన్నం ఫారెస్ట్ చెక్ పోస్ట్ , భద్రాచలం వద్ద విజయ లక్ష్మి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానా కు చెందిన మున్షిరం, బగత, మరియు గోవింద్ లు డబ్బులు జల్సా లకు అతిగా ఖర్చు చేసుకొని, సరిపోకపోవడం వల్ల గంజాయి వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చి, వీరు బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలం తో ఒక ఆటో ని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథం ల తయారు చేసి భక్తుల వేషం ధరించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ కలిమెల పరిసర ప్రాంతాలలో బుజ్జి అనే వ్యక్తీ వద్ద గంజాయి కొనుగోలు చేసి హర్యానా లో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తుల కు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా, ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుండి 484 కిలోల గంజాయి ఒక ఆటో, రెండు సెల్ ఫోనులను స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఒక కోటి 21 లక్షలు ఉంటుంది. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.