ప్రభుత్వ గ్యారంటీలను అర్హులకు చేరాలీ
Mahabubabad- డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్
గళం న్యూస్ మరిపెడ:-
అధికారులు పాత సావాసాలు వదిలేయాలని, గతంలో చేసిన తప్పిదాలు చేయకూడదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీలను అర్హులకు అందేలా ప్రణాళికలు రూపొందించాలని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అధికారులను సూచించారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలుత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేకు అధికారులు శాలువాలు, బొకేలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలన అంతమైందని,కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు పారదర్శకంగా పని చేయాలని, అర్హులను గుర్తించి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలాలను వారికి చేర్చాలన్నారు. నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన చేయాలని, ఇకపై ప్రజల నుంచి ఏ అధికారి కూడా నయా పైసా అదనంగా ఆశించకూడదన్నారు. త్వరలోనే మరో సమీక్ష నిర్వహిస్తానని, శాఖల వారీగా ఆయా రోజుల్లో సమీక్షలు నిర్వహించి సమస్యల సాధన, ప్రజా సంక్షేమ పునరుద్ధరణ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే గ్యారంటీలను అర్హులందరికీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, జిల్లా నాయకులు యుగంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాజోద్దీన్, ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవి, మండల నాయకులు కాలం రవీందర్ రెడ్డి, సోమ్ల తండా సర్పంచ్ కృష్ణా, మద్దోజ్ వెంకన్న, ఎంపీడీవో కేలోత్ ధన్సింగ్, మునిసిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సైదులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.