kvps news
దళితులకు ఇచ్చిన వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న దళితుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా దళితుల ఆకాంక్షలు నెరవేర్చాలని ఎన్నికలకు ముందు దళితులకు ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శనివారం జనగామ నాగులకుంటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లాస్థాయి విస్తృత సమావేశం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు తూటి దేవదానం అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందన్నారు మూడెకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత బంధు 10లక్షల నుంచి 12 లక్షలకు పెంచి ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు పదేండ్ల కాలంలో కొత్తగా ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని రేషన్ కార్డుకు నిజమైన లబ్ధిదారులైన దళితులకి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని దళి తులకు ఇచ్చిన వాగ్దానాల నీటిని క్రమ పద్ధతిలో చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేస్తే హర్షం వ్యక్తం చేస్తామని ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తే ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పల్లేరుల లలిత గడ్డం యాదగిరి మంద మహేందర్ బాణాల వెంకన్న,కల్లెపు శైలజ జిల్లా కమిటీ సభ్యులు శాగ సాంబరాజు,అరూరి కృష్ణ మచ్చ సంధ్య, అతీయ,మారపాక రమేష్ కె,మధు తదితరులు పాల్గొన్నారు