ఐడిఓసి కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై వైద్యశాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే నెల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడు కొవిడ్ లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రు ల్లో కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ నియంత్రణకు డ్రగ్స్,ఆక్సిజన్, వెంటిలేటర్లు,పీపీఈ కిట్లు,మాస్క్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి శిరీష మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.