Bhadrachalam - Latest News in TeluguBhadrachalam - Latest News in Telugu

డాక్టర్ ప్రియాంక అలావచ్చే భక్తులు మన అతిథులు ఎటువంటి అంతరాయాలు కలుగకుండా చూసుకోవాలి

భద్రాచలం 40 మంది గజ ఈతగాళ్లు, 20 నాటు పడవలు అలాగే పర్ణశాలలో 20 మంది గజ ఈతగాళ్లు, 12 నాటుపడవలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు

భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనం, గోదావరిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాలను పరిశీలించారు. కలెక్టర్ ఉత్తర ద్వారదర్శన సెక్టార్లను, హంసవాహనం ట్రయల్రన్ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22వ తేదీన జరగనున్న స్వామి వారి తెప్పోత్సవం, 23వ తేదీ ఉదయం జరుగనున్న ఉత్తర ద్వారదర్శన కార్యక్రమాలకు విచ్చేయు భక్తులు మన అతిథులని, వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులు స్నానాలు ఆచరించడానికి బారికేడింగ్ దాటి గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట నియంత్రణ చేయాలని చెప్పారు. హంసవాహనంనకు ముందు, వెకుక రెండు పైలెట్ నాటుపడవలు ఏర్పాటు చేయాలని చెప్పారు. 40 మంది గజ ఈతగాళ్లు, 20 నాటు పడవలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అలాగే పర్ణశాలలో 20 మంది గజ ఈతగాళ్లు, 12 నాటుపడవలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. బాణసంచాలు కాల్చు సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఉత్తర ద్వారదర్శనం వీక్షణకు విచ్చేయు భక్తులు కేటాయించిన సెక్టార్లులో ప్రవేశానికి తప్పని సరిగా టిక్కెట్ కలిగి ఉండాలని చెప్పారు. భక్తులకు ఎవరికి కేటాయించిన సెక్టార్లులో వారే ప్రవేశించాలని చెప్పారు. ఏర్పాట్లు పర్యవేక్షణ, భక్తులు క్రమపద్దతి పాటించేందుకు ప్రతి సెక్టారుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. సెక్టార్, లైజన్, ప్రోటోకాల్ విధులు కేటాయించిన అధికారులు ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి సెక్టారును భక్తులు గుర్తించేందుకు వీలుగా సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తుల యొక్క వాహనాలు నిలుపుదల చేసేందుకు పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాలయం, బ్రిడ్జి ప్రక్కన, జూనియర్ కళాశాల మైదానం, మార్కెట్ యార్డులలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల నుండి భక్తులు దేవాలయం వరకు వచ్చేందుకు ప్రత్యేకంగా 25 ఆటోలు ఏర్పాటు చేశామని, అట్టి ఆటోలకు భక్తులు నామమాత్రపు ధర చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. కోర్టు ప్రాంగణం, తానీషా కళ్యాణ మండపం, రాయల్ లాడ్జి, దేవాలయంలో స్వామి వారి ప్రసాదపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, భక్తులు యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. భక్తులకు సమాచారం అందించేందుకు కొత్తగూడెం బస్టాండు, రైల్వే స్టేషన్, భద్రాచలం బ్రిడ్జి పాయింట్, (టోలేట్) బస్టాండు, స్నాన ఘట్టాలు, విస్తా కాంప్లెక్సు, కూనవరం రోడ్, మార్కెట్యార్డు, చర్ల రోడ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తప్పిపోయిన భక్తులు సమీపంలోని సమాచార కేంద్రాల్లో కానీ, భద్రాచలం ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08743-232444 నెంబర్లుకు కాల్ చేయాలని చెప్పారు. సమాచార కేంద్రాల్లో భక్తులకు ఉపయోగపడు సమాచారపు కరపత్రాలు అందుబాటులో ఉంచాలని డిపిఆర్ ను ఆదేశించారు. అత్యవసర సేవలకు అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో బెడ్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర చికిత్సా కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఏదేని అత్యవసర సేవలకు వినియోగించడానికి వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లుతో సిద్దంగా ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టిసి అధికారులను ఆదేశించారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణకు అదనపు సిబ్బంది ఏర్పాటుతో పాటు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కేటాయించాలని డిపిఓకు
సూచించారు. భక్తులు వేడుకలు వీక్షించేందుకు వీలుగా సెక్టార్లులో ఎస్ఈడి టివిలు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. హెూటల్లో తినుబండారాలు, స్వామివారి తీర్థప్రసాదాల నాణ్యతలు పర్యవేక్షణ చేయాలని పౌర సరఫరాలు, ఆహార తనిఖీ అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని మిషన్ బగీరథ అధికారులకు సూచించారు. విధులు కేటాయించిన అధికారులకు, సిబ్బంది గుర్తింపు కార్డులు ధరించాలని, గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి ఉంటుందని చెప్పారు. 22, 23 తేదీల్లో మద్యం, మాంసాహారం విక్రయాలు నిలిపి వేయాలని ఆబ్కారి, పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.రాంబాబు, మధుసూదన్ రాజు, ఎఎస్పి పరితోష్పంకజ్, ఆర్డీఓ మంగీలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News