పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం
Uncategorizedసిపిఐఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు.
గళం న్యూస్ భూపాలపల్లి: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నుంచి ఎంపీలను అప్రజస్వామికంగా సస్పెండ్ చేయడాని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కారల్‌మార్క్స్ కాలనీ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు మాట్లాడుతూ పార్లమెంట్లో భద్రతా వైఫల్యం పై చర్చకు అవకాశం ఇయ్యాలని హోంమంత్రి దానిపై మాట్లాడాలని ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తీసుకురాగా, వారిని 143 మందిని అకారణంగా సస్పెండ్ చేయడం ఆప్రజాస్వామికమని బందు. సాయిలు గారు అన్నారు. అదేవిధంగా పార్లమెంటులో చోటు చేసుకున్న పొగ బాంబు ఘటనపై సమగ్ర చర్చ జరగాలని దోసులను కఠినంగా శిక్షించి దేశ భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు, జరిగిన ఘటనపై సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీసిన 143 మందిని ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేంద్రం కర్కషంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు.ప్రతి నిత్యం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రం బీజేపీని వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంపేటి.రాజయ్య,పోలం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య మరియు ఆత్కూరి శ్రీధర్, ఆకు దారి రమేష్, మేకల మహేందర్, వంగాల. లక్ష్మి, సిహెచ్ రవి కుమార్, రాజేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.