ou news brsv news trsv news revanth rddy news telugu newsou news brsv news trsv news revanth rddy news telugu news

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ (21.12.2023 గురువారం) ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధీ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల రూ. 4000 నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గానీ మ్యానిఫెస్టో లో గాని నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగుల ను అవమాన పరచటాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు.ఆనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగ నేతలు తగలబెట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ 1.8 శాతం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాలని చూస్తే నిరుద్యోగ జేఏసీ కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతుందని హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పదవుల కోసం కొద్దిమంది ఓయూ నాయకులు కాంగ్రెస్ నేతలకు బానిసలు కావచ్చు గాని ఓయూ మాత్రం ఎప్పుడు నిరంతరం ప్రతిపక్షంగానే ఉంటుందని మానవతారాయ్ వెల్లడించారు.లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ప్రియాంక గాంధీకి నిరుద్యోగుల ఉసురు తగిలి కొట్టకుపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ నేత మేడారపు సుధాకర్ నేత,ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ నేతలు దుర్గం వినోద్, బూసిపాక గణేష్ మాదిగ,పట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News