
zaffergadh news e69news daily telugu news local news lateast news
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం సాగరం గ్రామ చౌరస్తాలో సోమవారం రోజున టిఎస్ఎస్ కళాకారులు కళాజాత నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల గురించి పాటల రూపంలో ప్రజలకు వివరించారు.ప్రభుత్వం మహిళలకు,రైతులకు,నిరుద్యోగులకు భద్రత కల్పించేందుకు గొప్ప పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని,ఆరోగ్యశ్రీలో రూ.10 లక్షల వరకు వెసులుబాటు కల్పించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో టీం లీడర్ గడిపె బాలయ్య,కళాకారులు గద్దర్ సాంబయ్య,తిప్పర్తి శ్రీనివాసులు,బావండ్లపల్లి చిరంజీవి, ముక్కెర సంపత్ కుమార్, ఎడవల్లి విజయ తదితరులు పాల్గొన్నారు.