
telugu galam news e69news local news daily news today news
బుధవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ ప్రాంతంలో నిరుపేదలకు అనాధ మహిళలకు అమ్మ బాబా ఖాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మ బాబా ఖాన్ ఫౌండర్ ఎండి బాబా ఖాన్ చైర్మన్ సెక్రెటరీ దేవి రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముంజల బిక్షపతి గౌడ్ హాజరై దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది అనంతరం ముంజల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అనాధలకు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా గర్వించేదగ్గ విషయమని ఆయన అన్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు అమ్మ బాబా ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అనాధలకు నిత్యవసర వస్తువులు నిరుపేదలకు ఎన్నో సహకారాలు చేస్తున్నారని వారు అన్నారు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అనాధ పిల్లలను చదివించాలని ఆయన అన్నారు కొంతమంది కోట్లకు ఉన్న సేవ చేసే లక్షణాలు ఉండవని ఆయన అన్నారు కొంతమంది నిరుపేదలైన కూడా ఉన్నదాంట్లో అనాధలకు బీదలకు పంచి పెట్టాలని ఆలోచన రావడం చాలా మంచి ఆలోచనలు అని ముంజల అన్నారు బీదలకు సేవ చేయడం అంటే దేవుని కన్నా గొప్ప మనిషి సేవకుడని ముంజల అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ ఎండి బాబా ఖాన్ కార్యదర్శి దేవి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు