అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన
జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) శీలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో ప్రదర్శనను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను పరిశీలించారు.ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్ రంజిత్, సిబ్బంది పి. శ్రీనివాస్, ప్రవీణ్లను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.