OFFICE_OF_THE_DEPUTY_MAYOR
ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి….డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కి వినవించుకున లాలాపేట ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు…
హైదరాబాద్: తుకారం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(UPHC) లాలపెట్, ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బంది కి ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని డ్రెస్సింగ్ రూమ్, మంచినీరు, బోర్ వాటర్, వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూం లేవని డిప్యూటీ మేయర్ కు తమా సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు, రాష్ట్రం లో చలి తీవ్రత అధికంగా ఉన్నందు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు, ఆసుపత్రికి వచ్చే పిల్లలకు తక్షణ వైద్యం అందించి తగిన జాగ్రత్తలు సూచనలను వారికి అందజేయాలని తెలిపారు.
ఈ యొక్క సదస్సులో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (SPHO)డాక్టర్ జయశ్రీ , మెడికల్ ఆఫీసర్(MO) డాక్టర్ సౌశీల్య రాణి , హాస్పిటల్ సిబందులు, స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు