ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు
స్వప్న సాగర్ దంపతుల నూతన గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన తోట గోవిందమ్మ రామారావు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పేదవాడి సొంతింటి కళ ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హుడై
లబ్ది పొందిన స్వప్న సాగర్ దంపతులు వారి గృహప్రవేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు లను ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తోట గోవిందమ్మ రామారావు దంపతులు పాల్గొని నూతన గృహ ప్రవేశానికి ఏర్పాటుచేసిన రిబ్బను స్వప్న సాగర్ లతో కలిసి కట్ చేసి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసి వారినీ తమ కుటుంబ సభ్యులుగా సంబోధిస్తూ పుట్టింటి సాంప్రదాయంలో భాగంగా నూతన వస్త్రాలను, నగదు కానుకను అందించి ఆశీర్వదించారు.
తదనంతరం నూతన గృహ లబ్ధిదారులు స్వప్న సాగర్ దంపతులు తల్లిదండ్రులతో సమానమైన తోట గోవిందమ్మ రామారావు దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తోటరామారావు మాట్లాడుతూ ప్రతి పేదవాడు కూడు, గుడ్డ నీడనిచ్చే ఇల్లును కోరుకుంటారని దానితో ప్రతి పేదవాడి జీవిత ఆశయం నెరవేరుతుందని దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ గృహాల లో
డివిజన్ నుంచి అనేకమంది పేదవారు ఉన్నప్పటికీ కొంతమందికే అవకాశం
దక్కిందని ఇంకా అనేకమంది పేద కుటుంబాలు తమ సొంతింటి కలలను నెరవేర్చుకునే దిశలో ప్రభుత్వం అధికారులకు మొర పెట్టుకుంటున్నారని ఈ విషయంపై ప్రభుత్వం తగు ఆలోచన చేసి విడతల వారిగా నైనా మిగిలి ఉన్న లబ్ధిదారులు కూడా ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించి పేదవాడి సొంతింటి కళను నెరవేర్చాలని మంత్రివర్యులను, అధికారులను కోరారు.
ఈ నూతన గృహప్రవేశంలో డివిజన్ ఎక్స్ కౌన్సిల్ సభ్యులు వంగాల వెంకట్ డివిజన్ అధ్యక్షులు చేతి కృష్ణ
యువ నాయకుడు తోట రమేష్
మైనారిటీ నాయకులు బాబా
డివిజన్ బాధ్యుడు కిషన్ నాయక్, వేల్పుల శీను, చింటూ, రియాజ్ నిరంజన్,
కునుపురి మహేష్, మధు, రవీందర్,
లింగా రెడ్డి, ఆకుల సత్యం, రమణ,తోకల ప్రభాకర్ పాల్గొన్నారు.